26.8 C
Hyderabad

కేసీఆర్, హరీష్ రావులపై చర్యలు తీసుకోవొద్దు

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ :  కాళేశ్వరం కమిషన్ నివేదికపై కేసీఆర్, హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది.  అసెంబ్లీలో చర్చించి సీబీఐ దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్న ఏజీ సుదర్శన్ రెడ్డి కోర్టుకు తెలిపారు. అక్టోబర్ 7వ తేదీన ప్రధాన పిటిషన్ విచారణ ఉన్నందున అప్పటి వరకు కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని  కేసీఆర్, హరీష్ రావు తరపు న్యాయవాదులు కోర్టును కోరారు.  ఇరువురి వాదనలు అనంతరం  అక్టోబర్ 7వ తేదీన దసరా సెలవుల అనంతరం తదుపరి విచారణ ఉంటుందని  హైకోర్టు పేర్కొంది.  అప్పటి వరకు వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

 

More articles

Latest article