26.2 C
Hyderabad
Monday, August 3, 2026

పోలీస్ శాఖలో కిస్సా కుర్చీకా..

Must read

📰 Generate e-Paper Clip

  • పోకల్ పోస్టింగ్ ల కోసం తహ తహ
  • పోస్టింగ్ ల కోసం అడ్డదారులు
  • లీడర్లతో పైరవీలు.. సిఫారసులు

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : మల్టీ జోన్ 1 పరిధిలో అతిపెద్ధ పోలీస్ కమిషనరేట్ (నిజామాబాద్) లో పోస్టింగ్ ల కోసం పోలీస్ అధికారులు చేస్తున్న పైరవీలు, సిఫారసులు, చేస్టలు పోలీస్ బాస్ లకు మింగుడు పడటం లేదు. ఎందుకంటే పోస్టింగ్ (కుర్చీల) కోసం వారు చేస్తున్న యవ్వారాలు పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారతున్నాయి. ఫక్తు రాజకీయ నాయకులను మించిపోతున్నాయి పోస్టింగ్ ల కోసం పోలీస్ అధికారులు చేస్తున్న పనులు. పోస్టింగ్ లు ఖాళీగా ఉన్నప్పుడు పైరవీలు, సిఫారసులు చేయడం సర్వసాధారణం. కానీ ప్రస్తుతం అధికారులు ఎక్కువ పోస్టింగ్ లు తక్కువ అన్నచందంగా మారింది పరిస్థితి. అంతే గాకుండా కాసులు దండిగా (పోకల్) వచ్చే పోస్టింగ్ లకు కాంపిటీషన్ ఎక్కువగా ఉండి కుర్చీల కోసం లక్షల రూపాయలను ఖర్చు చేస్తున్నారు. అదీ చాలదన్నట్టు పోస్టింగ్ ల కోసం ప్రస్తుతం పనిచేస్తున్న వారి వెనుక గోతులను తీసే పరిస్థితి నెలకొంది. అవినీతి, అక్రమాలు, కలెక్షన్ కింగ్ లుగా పేరున్నప్పటికీ వారిపై చర్యలు తీసుకోకపోవడం తో పోలీస్ బాస్ లకు వినని పరిస్థితి నెలకొంది.

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఒక కీలక పోలీస్ స్టేషన్ లో ఎస్హెచ్ఓ పోస్టింగ్ కోసం జిల్లాలో పనిచేస్తున్న ఓఅధికారి తన ప్రాంతానికి చెందిన ప్రజా ప్రతినిధికి లక్షలు ముట్ట చెప్పినట్టు సమాచారం. ఐతే అప్పటికే అక్కడ పోస్టింగ్ లో చేరిన అధికారి పట్టుమని పదినెలలు కాకముందే పోస్టింగ్ ఎలా మార్చాలని వ్యవహారం నేతలు తలలు పట్టుకుంటున్నట్టు తెలిసింది. అసలే పోలీస్ శాఖలో కలెక్షన్ కింగ్  సార్థక నామధేయుని కారణంగా తనవద్ధ పనిచేస్తున్న పాపానికి ఇద్దరు సిబ్బందిపై వేటు పడినప్పటికీ కనీసం మెమో రాకుండా పైనుంచి మేనేజ్ చేశారని పోలీస్ శాఖలో ప్రచారం జరుగుతుంది. సంబంధిత ఎస్ హెచ్ఓ  పోస్ట్ కోసం పొలిటికల్ లీడర్ తనయుని ద్వారా జరుగుతున్న పైరవీలను తెలుసుకుని పోలీస్ అధికారులే ముక్కున వేలేసుకుంటున్నారంటే అతిశయోక్తికాదు.

పోలీస్ శాఖలో ఎలాంటి పోస్టింగ్ లు లేని వారికి పోలీస్ బాస్ కార్యాలయాలకు అటాచ్ చేయడం సంప్రదాయం. అక్కడ శాఖ కార్యాలయంలో వివిధ విభాగాలలో వారి సేవలను వినియోగించుకోవడం సర్వ సాధారణం. వివిధ బందోబస్తుల సమయంలోను యూనిఫం లలొ పనిచేస్తు, మిగితా సమయంలో యూనిఫాం లేకుండా పనిచేయిస్తుంటారు. అక్కడ సీఐలతో పాటు ఎస్ఐలు కోకోల్లలు. అక్కడ పనిచేస్తున్న కొందరు ఇటీవల ఖాళీ ఐనా టాస్క్ ఫోర్స్ లో పోస్టింగ్ ల కోసం పైరవీలు చేస్తున్నట్టు సమాచారం. అందులో కొందరు అధికారులు తాము పనిచేసిన కాలంలో అమాయకులపై అక్రమంగా కేసులు పెట్టి లోకయుక్తా చుట్టు తిరుగుతున్నావారు కుడా ఉండటం విశేషం. మరికొందరు ఆన్ లైన్ బెట్టింగ్ (ఐడి) ముఠాతో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన వారు కుడా పైరవీలు చేస్తున్నట్టు తెలిసింది. తాము అధికారులుగా పనిచేసిన చోట ప్రేమాయణాలు నడిపి శాఖ పరువు తీసిన వారు కుడా కమిషనరేట్ పరిధిలో మళ్లీ టాస్క్ ఫోర్స్ లో పనిచేసి నాలుగు రాళ్లు వేనుకుసేకునే యత్నాలు చేస్తుండటం పోలీస్ అధికారులే షాక్ కు గురవుతున్నారు. మట్కా నిర్వహకులు, పిడిఎస్ నిర్వహకులతో మిలాఖాత్ అయి కేసులు నమోదు చేయని వారు ఇప్పుడు టాస్క్ ఫోర్స్ లో పోస్టింగ్ లకోసం అధికారుల చుట్టు చక్కర్లు కొడుతుంటే వారికి పోస్టింగ్ ఇస్తే నిజామాబాద్ కమిషనరేట్ పరువు గంగలో కలువడం ఖాయమని ఖాకీలలో గుస గుసలు వినిపిస్తున్నాయి.

More articles

Latest article