. . . యశోద ఆసుపత్రి నెఫ్రాలజిస్ట్ డాక్టర్ మామిడి ప్రణీత్ రామ్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
కిడ్నీ మార్పిడి వలన రోగికి డయాలసిస్ సమస్య శాశ్వతంగా దూరమవుతుందని యశోద ఆసుపత్రి వైద్యులు డాప్రణీత్ రామ్ వెల్లడించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని యశోద ఆసుపత్రికి కేర్ సెంటర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన షకీల్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు తన రెండు కిడ్నీల సమస్యతో 2022నుండి 2024వరకు డయాలసిస్ ప్రారంభించిన వ్యక్తిని ప్రాణాపాయం నుండి రక్షించామన్నారు. డయాలసిస్ క్యాథెటర్ ఇన్ఫెక్షన్ల వంటి సవాళ్లని ఎదురొన్నప్పటికీ పట్టుదలతో నిలబడ్డారన్నారు. షకీల్ కు కిడ్నీ మార్పిడికి ముందు చేసిన పరీక్షల్లో గుండె సమస్య బయటపడిందన్నారు. దీనికోసం ఆయనకు కరోనరీ ఆర్టరి స్టెంటింగ్ చేయడం జరిగిందన్నారు.. స్టెంట్ వేసిన ఆరు నెలల తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా మారడంతో కిడ్నీ మార్పిడి విజయవంతంగా జరిగిందన్నారు. కిడ్నీ మార్పిడి ఆవశ్యకత గురించి అతనికి వివరించగా షకీల్ భార్య మనోవర్ ఇర్ఫానా తన కిడ్నీ ఇవ్వడానికి ముందుకు రావడం కీలకమైన మలుపు అని పేర్కొన్నారు. 2024లో కిడ్నీ మార్పిడి జరిగిన తర్వాత ఇప్పుడు ఎవరి సహాయం లేకుండా ఉపాధ్యాయుడిగా తన వృత్తిని,వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకుంటూ సాధారణ జీవితాన్ని గడుపుతున్నారన్నారు. వయస్సు, అనారోగ్య సమస్యల వల్ల కిడ్నీ మార్పిడి పై సందేహాలు ఉన్నవారికి షకీల్ ప్రయాణం గొప్ప స్ఫూర్తి అని కొనియాడారు. సరైన వైద్యం, కుటుంబ సభ్యుల మద్దతు ఉంటే మళ్లీ ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందవచ్చన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో యశోద ఆసుపత్రి మార్కెటింగ్ మేనేజర్ శ్రీరామ్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.
