27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

కేశాపూర్ నారాయణ జూనియర్ కళాశాలను సీజ్ చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . పిడిఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

ప్రభుత్వ అనుమతి లేకుండా కేశపూర్ గ్రామ పరిధిలో నెలకొల్పిన నారాయణ జూనియర్ కళాశాల పై చర్యలు చేపట్టాలని పిడిఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ నగరంలో జిల్లా ఇంటర్ విద్యా శాఖ అధికారి టి.రవి కుమార్ కి పిడిఎస్ యూ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా లో ప్రభుత్వ అనుమతులు లేకుండా నారాయణ విద్యాసంస్థలు విద్యార్థులను విద్యార్థి తల్లిదండ్రులను మోసం చేసి లక్షరాది రూపాయలు తీసుకొని అక్రమ మార్గంలో అడ్మిషన్లు చేసుకున్నారని, కళాశాల నిర్మాణ దశలో  ఉందని, విద్యార్థులను ఈ రోజు రిపోర్టింగ్ చేసి రేపట్నుంచి తరగతులకు హాజరు కావాలని నారాయణ విద్యాసంస్థల అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారని, విద్యార్థుల భవిష్యత్తును ను దృష్టిలో ఉంచుకొని అనుమతి లేని నారాయణ జూనియర్ కళాశాలను సీజ్ చేయాలని, లేనిచో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్ యూ నగర అధ్యక్షులు సిర్రం పవన్ కుమార్, నాయకులు మనోజ్, శ్రీకర్, ప్రసాద్, వంశీ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article