29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

కేరళ పాఠశాల గుర్తింపు రద్దు చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

  • బీవీఎం రాష్ట్ర కార్యదర్శి ఙివియం.విఠల్

 

నిజామాబాద్, బతుకమ్మ: నాగిరెడ్డిపేట్ మండల గోపాల్పేట్ గ్రామంలో ఉన్న కేరళ పాఠశాల యజమాన్యంపై చర్యలు తీసుకొని పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని సోమవారం కలెక్టర్ కు  భారతీయ విద్యార్థి మోర్చ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బీవీఎం రాష్ట్ర కార్యదర్శి జివిఎం. విఠల్ మాట్లాడారు. విద్యార్థుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తూ మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని అన్నారు. విద్యార్థులను మానసికంగా ఇబ్బంది పెడుతూ ఫిజులు కట్టకపోతే ఇష్టానుసారంగా దౌర్జన్యంగా దాడి చేసి వాతలు వచ్చే విధంగా కొడుతున్నారని తెలిపారు. గతంలో ఇదే విధంగా జరిగితే జిల్లా విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేశామని అన్నారు. కానీ నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోలేకపోయారని అన్నారు. మండల విద్యా శాఖ అధికారి ఏలాంటి పర్యవేక్షణ లేకపోవడం, చర్యలు తీసుకోకపోవడం వల్లే యాజమాన్యం విద్యార్థులను బెదిరింపులకు పాల్పడుతూ విద్యాను వ్యాపారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రేకుల షెడ్ లో పాఠశాలను నడుపుతూ సరైన సౌకర్యాలు లేకుండా ఒక్క రూమ్ లో  80 నుంచి 100 మంది విద్యార్థులు కూర్చోబెడుతున్నారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న కేరళ పాఠశాల గుర్తింపు ను రద్దుచేసి యజమాన్యంపై చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి యశ్వంత్, జిల్లా నాయకులు శ్రవణ్, అభిలాశ్, శ్రేయస్,తదితరులు పాల్గొన్నారు.

Kerala school should be de-recognised

More articles

Latest article