కేరళ పాఠశాల గుర్తింపు రద్దు చేయాలి
బీవీఎం రాష్ట్ర కార్యదర్శి ఙివియం.విఠల్ నిజామాబాద్, బతుకమ్మ: నాగిరెడ్డిపేట్ మండల గోపాల్పేట్ గ్రామంలో ఉన్న కేరళ పాఠశాల యజమాన్యంపై చర్యలు తీసుకొని పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని సోమవారం కలెక్టర్ కు భారతీయ విద్యార్థి మోర్చ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బీవీఎం రాష్ట్ర కార్యదర్శి జివిఎం. విఠల్ మాట్లాడారు. విద్యార్థుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తూ మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని అన్నారు. విద్యార్థులను మానసికంగా ఇబ్బంది పెడుతూ ఫిజులు కట్టకపోతే ఇష్టానుసారంగా దౌర్జన్యంగా దాడి చేసి వాతలు వచ్చే...