29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

చిన్నారికి ‘హెల్ప్ హ్యాండ్స్’ చేయూత

Must read

📰 Generate e-Paper Clip

వేల్పూర్, బతుకమ్మ : రెండు నెలల వయస్సులో క్యాన్సర్ మహమ్మారిబారిన పడి హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారికి ‘హెల్ప్ హ్యాండ్స్’ సేవా సంస్థ సభ్యులు ఆపన్న హస్తం అందించారు. చిన్నారి చికిత్స కోసం తమ వంతు సాయంగా రూ.5వేల నగదును సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా హెల్ప్  హాండ్స్ సంస్థ సభ్యులు మాట్లాడుతూ.. వన్నెల్ (బి) గ్రామానికి చెందిన వినయ్ కుమార్, నివేదిత దంపతులకు జన్మించిన రెండు నెలల చిన్నారికి క్యానర్సర్ నిర్ధారణ కాగా చికిత్సకు రూ.15లక్షలు ఖర్చవుతాయని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం కీమో థెరపీ చేస్తున్నారు. ఇప్పటికే తల్లిదండ్రులు రూ.4.50లక్షల వరకు అప్పు చేసి చికిత్స చేయించారు. ప్రస్తుతం చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నారు.

More articles

Latest article