24.7 C
Hyderabad
Monday, August 3, 2026

బహిరంగ చర్చకు సిద్ధం అన్న మాట నిలబెట్టుకోండి

Must read

📰 Generate e-Paper Clip

  • వేదిక నువ్వు సిద్ధం చేస్తావా మమ్మల్ని సిద్ధం చేయమంటావా
  • రాజీనామాకు సిద్ధంగా ఉండు
  • దండు శేఖర్ పై దాడి చేసిన వ్యక్తి కాంగ్రెస్ కు చెందిన నేతగా అసత్య ప్రచారం చేయడం వారి చేతకాని రాజకీయాలకు పరాకాష్ట
  • డిసిసి అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి

నిజామాబాద్ సిటీ బతుకమ్మ : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే అసత్య, దిగజారుడు మాటలు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని డిసిసి అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి విమర్శించారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ  ప్రశాంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై ఏ గ్రామంలోకి వెళ్లి ప్రజలతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నారా అన్న వ్యాఖ్యలను తాము ఆహ్వానిస్తున్నట్లు, ఆయనకు దమ్ము ధైర్యం ఉంటే రాష్ట్ర ప్రజలు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై వాస్తవ మాటలు మాట్లాడితే ఎమ్మెల్యే పదవికి సిద్ధమా అని సవాల్ విసిరారు. పదేళ్ల టిఆర్ఎస్ పాలనలో ప్రగతి ప్రజలకు అబద్ధపు హామీలు ఇచ్చి తుంగలో తొక్కిన చరిత్ర ఆ పార్టీ నేతలదని విమర్శించారు. రాష్ట్రంలో 6 గ్యారంటీలు అమలు చేస్తున్నామని, రుణమాఫీ విషయంలో కూడా హామీ అమలుకు కట్టుబడి ఉన్నామని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సబ్సిడీ సిలిండర్, రుణమాఫీతో పాటు వేలాది ఉద్యోగాలు ఇచ్చామని ఆయన అన్నారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని 10 లక్షల వరకు పెంచిన ఘనత కాంగ్రెస్ పార్టీకి చెందుతుందన్నారు. పదేళ్లపాటు రాష్ట్రాన్ని దోచుకుని అప్పులపాలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. రైతు భరోసా పథకం కూడా త్వరలోనే అమలు చేస్తామనిరాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికేరైతులకు హామీ ఇవ్వడం జరిగిందన్నారు.అధికారం లేక మంత్రి పదవి కోల్పోయి ప్రశాంత్ రెడ్డి మానసిక బాగా లేనట్లు ఉందని విమర్శించారు. ఆ పార్టీ నేతలు తమ పార్టీముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,పిసిసి చీఫ్మహేష్ కుమార్ గౌడ్ లపై విమర్శలు చేస్తే తాట తీస్తామన్నారు..

దండు శేఖర్ పై దాడి చేసిన వ్యక్తికి కాంగ్రెస్తో ఎలాంటి సంబంధం లేదు : నూడా చైర్మన్ కేశ వేణు

టిఆర్ఎస్ పార్టీకి చెందిన నగర మేయర్ భర్త దండు శేఖర్ మీద జరిగిన అమానుష డాడీ ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఈ డాడితో ఎలాంటి సంబంధం లేదన్నారు. శేఖర్ పై దాడికి దిగిన రసూల్ కు కాంగ్రెస్ పార్టీలో కేవలం ప్రాథమిక సభ్యత్వం కూడా లేదని, అలాంటప్పుడు ఆయన కాంగ్రెస్ నేత ఎలా అవుతారని నిందితురు రసూల్ ఏనాడు కూడా కాంగ్రెస్ కోసం పని చేయలేదని స్పష్టం చేశారు. టిఆర్ఎస్ పార్టీ అంతర్గత కలహాల వల్లే ఈ ఘటన జరిగిందని వ్యాఖ్యానించారు. లగీచర్ల లాంటి ఘటన ఇక్కడ చేసేందుకు ఈ ఘాటుకానికి పాల్పడడంజరిగిందన్నారు.కవితను మళ్ళీ జిల్లాకు ఎంట్రీ ఇచ్చేందుకే టిఆర్ఎస్ పార్టీపూర్తిగా యజ్ఞాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఈ మీడియా సమావేశంలో గ్రంధాలయ చైర్మన్ అంత రెడ్డి రాజిరెడ్డి, మైనారిటీ నాయకుడు జావిద్ అక్రం తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article