మోర్తాడ్, బతుకమ్మ :
గ్రామంలోని అన్ని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వలన ప్రజలకు వ్యాధులు సోకకుండా ఉండవచ్చని సర్పంచ్ విజయ్ కుమార్ అన్నారు. మోర్తాడ్ మండలంలోని శెట్ పల్లీ గ్రామపంచాయతీ కార్యాలయం లో విధులు నిర్వహిస్తున్న పరిశుద్ధ కార్మికులకు బుదవారం ఉపసర్పంచ్ బడే సాయిరాం, వార్డు సభ్యుల ఆధ్వర్యంలో సబ్బులు, నూనె, మాస్క్ లు, గ్లౌజ్ లు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్, కారోబార్ పృథ్వీ రాజ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
