బీఆర్‌కే భవన్‌లోకి కేసీఆర్ వెంట 9 మందికి అనుమతి
కాళేశ్వరం కమిషన్ ఎదుట 11.30కు హాజరుకానున్న కేసీఆర్
కేసీఆర్ ఏం చెప్పనున్నాడని సర్వత్రా ఉత్కంఠ
గజ్వేల్, బతుకమ్మ : గజ్వేల్ ప్రాంతంలోని ఎర్రవెల్లి ఫాంహౌస్ నుంచి బుధవారం కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ బయలుదేరివెళ్లారు. ఉ.11:30కి హైదరాబాద్ లోని బీఆర్‌కే భవన్ కు కేసీఆర్ చేరుకోనున్నారు. బీఆర్‌కే భవన్ లోకి కేసీఆర్ వెంట 9 మందికి అనుమతి లభించింది. కేసీఆర్ వెంట హరీష్‌రావు, కవిత, ప్రశాంత్‌రెడ్డి వెళ్లనున్నారు. కేసీఆర్ రాక సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బందోబస్తులో వందలాది మంది పోలీసులు ఉన్నారు. మరో వైపు కేసీఆర్ ఏం చెప్పనున్నాడనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఫామ్హౌస్కి వెళ్లి కేసీఆర్ ను కలిసిన ఎమ్మెల్సీ కవిత..
లేఖ వివాదం వెలుగులోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ఎమ్మెల్సీ కవిత ఫామ్హౌస్కి వెళ్లి కేసీఆర్ ను కలిసింది. కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరుకానున్న సమయంలో కేసీఆర్ ను కలిసేందుకు కవిత వచ్చింది.
