హైదరాబాద్, బతుకమ్మ: బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా నంది నగర్ లోని వీరాంజనేయ స్వామి ఆలయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నందినగర్ లోని ఆయన ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. కవిత వెంట బీఆర్ఎస్ కార్పొరేటర్ మన్నె కవిత తదితరులు పాల్గొన్నారు.
