ఎత్తొండ సొసైటీకి డీసీసీబీ డిమాండ్ నోటీసులు

0 99,867
  • రూ.1,34,10,862 రుణాలు తాలుకు బకాయిలు చెల్లింపునకు నోటీసులు
  • 10 రోజులు గడిచిన ఉలుకు పలుకు లేని అధికార యంత్రాంగం
  • రుణం చెల్లించకపోతే 2 ఎకరాలు 63 సెంట్ల భూమి వేలం వేస్తామని ప్రకటన
  • తాళ్ళరాంపూర్ సొసైటీ బాటలోనే ఎత్తొండ సొసైటీ

నిజామాబాద్, బతుకమ్మ
నిజామాబాద్ జిల్లాలో సహకార సంఘాలు దివాలా దిశలో నడుస్తున్నాయి. రాష్ట్రంలో సహకార సంఘాల్లో మొదటి స్థానంలో ఉన్న నిజామాబాద్ జిల్లా ఇప్పుడు దివాలా బోర్డులు కనిపిస్తున్నాయి. రైతుల స్వేదంతో నిర్మించిన వ్యవసాయ ప్రాథమిక పరపతి సహకార సంఘాలు (ప్యాక్స్)లు నష్టాలు ఊబిలో విలవిలలాడుతున్నాయి. గత ప్రభుత్వం హయంలో వెలుగు చూస్తున్న అక్రమాలు సహకార సంఘాల ఆస్తులను అమ్ముకోవాల్సిన పరిస్థితి దాపురించింది. ప్రధానంగా సొసైటీ పాలకవర్గాలు రైతుల సొమ్మును, ప్రభుత్వ సొమ్మును దిగమింగిన వారిపై చర్యలకు వెనుకడుగు వేస్తున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యేల ప్రధాన అనుచరులే కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దిగమింగిన క్రిమినల్ కేసులు లేవు. రెవెన్యూ రికవరి యాక్టు లేదు. సహకార చట్టంలో ఉన్న లోటుపాట్లతో సహకార శాఖ అండదండలతో కోట్ల రూపాయలను మెక్కిన పాలకవర్గంపై ఎమ్మెల్యేలు చీమవాలనివ్వడం లేదు. దానితో రాష్ట్రంలో పేరెన్నికగన్నా సొసైటీలు ఇప్పుడు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు, మార్క్ ఫెడ్ ద్వారా తీసుకున్న ఎరువుల తాలుకు బకాయిలు, పౌర సరఫరాల శాఖ ద్వారా తీసుకున్న ధాన్యం తాలుకు డబ్బులు చెల్లించలేక ఆస్తులను వేలం వేసే దిశగా నడుస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏర్గట్ల మండలం తాళ్ళరాంపూర్ సొసైటీ అవినీతి అక్రమాల విషయంలో రైతులు తాకట్టుపెట్టిన బంగారం తాలుకు డబ్బులు చెల్లించేందుకు భూములను వేలం వేసిన విషయం తెల్సిందే. ఇప్పుడు అదే కోవాలో కోటగిరి మండలం ఎత్తొండ సహకార సొసైటీ భూముల వేలానికి రంగం సిద్దమైంది.

DCCB demand notices to Othonda society
కోటగిరి మండలం ఎత్తొండ సహకార సొసైటీ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ శాఖ ద్వారా తీసుకున్న రూ.1,34,10,862 రుణాలు తాలుకు బకాయిలు చెల్లించాలని 24-12-2024న నోటీసులు జారీ చేశారు. తెలంగాణ సహకార శాఖ సెక్షన్ 70 ప్రకారం రూల్ 52ను అనుసరించి పది రోజుల్లో రుణాల తాలుకు బకాయిలను వడ్డితో సహా చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఒకవేళ రుణాన్ని చెల్లించని యేడల బ్యాంక్ కు తనాఖా పెట్టిన 2 ఎకరాల 13 సెంట్ల భూమిని వేలం వేస్తామని డీసీసీబీ డిమాండ్ నోటీసును జారీ చేసింది. క్యాష్ క్రేడిట్ కింద తీసుకున్న రుణం తాలుకు బకాయిల కోసం భూములు వేలం వేస్తామని ప్రకటించారు. ఎత్తొండ సహకార సొసైటీకి కోట్ల రూపాయల ఆస్తులు ఉండగా ఇప్పుడు బ్యాంక్ నుంచి తీసుకున్న రుణాన్ని చెల్లించలేని దుస్థితిలో ఉంది. ఇది వరకే బ్యాంక్ రుణమే కాకుండా రైస్ మిల్ ద్వారా మరఆడిస్తామని సివిల్ సప్లయ్ 41,629 క్వింటాళ్ల దాన్యం ఇవ్వాలి. దాని విలువ రూ. 9,57,46,700 చెల్లించాలి వాటిని 25 శాతం పెనాల్టీతో రూ.2,39,36,675 మొత్తం చెల్లించాల్సి ఉంది. బ్యాంక్ రుణం, పౌర సరఫరాల శాఖకు మొత్తంగా కలిపి చెల్లించాల్సిన బకాయిలు రూ.13,30,94,237 కోట్లు చెల్లించాల్సి ఉంది. బాధ్యులైన వారు ఇతరుల మీద నేపం తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అనేక రూపాయల అవినీతి బయటకు రావాల్సి ఉంది. హైకోర్టులో కేసులు కొట్టేశారని ప్రచారం చేస్తున్నారు. రైస్ మిల్లు అమ్మి డబ్బులు చెల్లిస్తామని ప్రచారం చేస్తున్నారు.
నిజామాబాద్ జిల్లాలో తాళ్ళరాంపూర్, ఎత్తొండ సహకార సొసైటీలకు దశాబ్ధాల చరిత్ర ఉంది. కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. వేల మంది రైతులు సొసైటీలో సభ్యులుగా ఉన్నారు. అయితే అధికారంలో ఉన్న పార్టీల నేతలు తమ అనుచరులకు సొసైటీలను దారదత్తం చేశారు. దానితో వారిలో జవాబుతనం లోపించి కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు. ఈ విషయంలో సహకార శాఖ విచారణతో పాటు విజిలెన్స్ విచారణలోనూ వెల్లడయింది. కానీ ఇప్పటి వరకు రెండు సొసైటీల పాలకవర్గాలపై చర్యలు లేవు. తాళ్ళరాంపూర్ సొసైటీ చైర్మన్, కార్యదర్శిపై క్రిమినల్ కేసుల నమోదుతో పాటు రెవెన్యూ రికవరి యాక్టు నమోదైన ఒక్క రూపాయి కూడా వసూల్ జరుగలేదు. ఇదే పరిస్థితి ఎత్తొండ సొసైటీలోనూ జరిగింది. ఇటీవల కాలంలో మహాజన సభలోనూ ఎత్తొండ సొసైటీలో జరిగిన అవినీతి గురించి నిలదీశారు. కానీ ఇప్పటి వరకు అక్కడ పాలకవర్గం నుంచి ఎలాంటి హామీ లభించలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో స్థానిక ఎమ్మెల్యేల ప్రధాన అనుచరులే సూత్రదారులుగా జరిగిన అవినీతికి వారే కొమ్ముకాశారన్న ఆరోపణలున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా తాళ్ళరాంపూర్ సొసైటీలో అక్రమాలపై చర్యలు లేవు. తాజాగా డీసీసీబీ డిమాండ్ నోటీసు ఇచ్చిన ఎత్తొండ సొసైటీ విషయంలో అధికార పార్టీ ఎమ్మెల్యే గానీ, అధికార యంత్రాంగం కానీ నోరు మెదకపోవడంపై రైతులు మండిపడుతున్నారు.

DCCB demand notices to Othonda society

Leave A Reply

Your email address will not be published.