28.8 C
Hyderabad
Monday, August 3, 2026

ఆర్ ఎస్ పీ ఆధ్వర్యంలో కార్ల్ మార్క్స్ వర్ధంతి

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : 

 

నిజామాబాద్ నగరంలోని నాందేవ్ వాడలో గల రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ కార్యాలయంలో ప్రపంచ ప్రఖ్యాత తత్వవేత్త, కార్మిక వర్గ విమోచన కోసం పోరాడిన మహనీయుడు కార్ల్ మార్క్స్ వర్ధంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జిల్లా కన్వీనర్ కటారి రాములు మాట్లాడుతూ కార్ల్ మార్క్స్ సమాజంలో ఉన్న దోపిడీ వ్యవస్థలను శాస్త్రీయంగా విశ్లేషించి కార్మికులు, రైతులు సమాన హక్కులతో జీవించే సమాజం కోసం మార్గదర్శక ఆలోచనలు అందించిన మహనీయుడని పేర్కొన్నారు. ఆయన సిద్ధాంతాలు నేటికీ ప్రపంచ వ్యాప్తంగా కార్మిక వర్గ ఉద్యమాలకు ప్రేరణగా నిలుస్తున్నాయని అన్నారు.అలాగే సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువల కోసం మార్క్స్ చూపిన మార్గాన్ని అనుసరిస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో నాయకులు, పిట్లనరేష్, గోపాల్ సింగ్ ఠాగూర్, సునీల్ కార్యకర్తలు పాల్గొని కార్ల్ మార్క్స్ ఆలోచనలను స్మరించుకున్నారు.

More articles

Latest article