ఆర్ ఎస్ పీ ఆధ్వర్యంలో కార్ల్ మార్క్స్ వర్ధంతి

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :    నిజామాబాద్ నగరంలోని నాందేవ్ వాడలో గల రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ కార్యాలయంలో ప్రపంచ ప్రఖ్యాత తత్వవేత్త, కార్మిక వర్గ విమోచన కోసం పోరాడిన మహనీయుడు కార్ల్ మార్క్స్ వర్ధంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జిల్లా కన్వీనర్ కటారి రాములు మాట్లాడుతూ కార్ల్ మార్క్స్ సమాజంలో ఉన్న దోపిడీ వ్యవస్థలను శాస్త్రీయంగా విశ్లేషించి కార్మికులు, రైతులు సమాన హక్కులతో జీవించే సమాజం కోసం మార్గదర్శక...