24.1 C
Hyderabad
Monday, August 3, 2026

కాంగ్రెస్ పార్టీలో చేరిన కరిపే శ్రీనివాస్

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

నగరంలోని 37 వ డివిజన్ కు చెందిన కరిపే శ్రీనివాస్ (టెంట్ హౌస్) ఆయన భార్య లావణ్య సుమారు 100 మందితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో నిజామాబాద్ కార్పొరేషన్ డిసిసి అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో ఆదివారం వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిచారు. ఆయన మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా బీజేపీ లో కొనసాగిన శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధిని చూసి, అమలవుతున్న సంక్షేమ పథకాలను చూసి ఆకర్షితులై పార్టీలో చేరారని,ఇది రాష్ట్రంలో ప్రభుత్వ పాలనకు వస్తున్న ఆదరణకు నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో డిల్లీ భక్తవత్సలం, అష్రఫ్, సత్యనారాయణ గౌడ్, రమేష్, మారుతి, క్రాంతి, గంగమణి, లావణ్య, రమ్య, హేమలత, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article