26.2 C
Hyderabad

వరి కొయ్యలను కాల్చవద్దు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,మోర్తాడ్: వానాకాలం వరి కోతలు చివరి దశలో ఉన్నందున వచ్చే యాసంగి కి సమాయత్తం ఐతున్న రైతులు ఎట్టి పరిస్థితుల్లో వరి కొయ్యలను కాల్చవద్దు అని మోర్తాడ్ మండల వ్యవసాయ అధికారి హరీష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. వరి కొయ్యలను కాల్చడం వల్ల నేలతో పాటు పర్యావరణం పైన చెడు ప్రభావం పడుతుందని అది మంచిది కాదు అని పేర్కొన్నారు. ముఖ్యంగా మట్టిలోని సూక్ష్మ జీవులు తగ్గిపోవడం, విలువైన పోషకాలు ఆవిరై పోవడం, మట్టికి తేమను పట్టుకొని ఉండే గుణం తగ్గిపోవడం వంటి నష్టాలు ఎన్నో ఉన్నాయ్ అని ప్రత్యామ్నాయంగా కొయ్యలను SSP లాంటి ఎరువులని వాడి పొలంలోనే కుళ్లిపోయేలా చేసినట్టయితే భూసారం పెరిగి వచ్చే పంట కాలంలో మంచి దిగుబడి సాధించుకోవచ్చు అని తెలియజేశారు. రైతులకి ఈవిషయం లో ఏదయినా సందేహం వుంటే స్థానిక వ్యవసాయ విస్తీర్ణ అధికారులని కానీ వ్యవసాయ అధికారిని కానీ సంప్రదించాల్సిందిగా కోరారు.

More articles

Latest article