- మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారు
- అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం
- జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుపై మాజీ ఎంపిటిసి అవర్ సురేష్ ఫైర్
బతుకమ్మ: బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో శనివారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ అవర్ సురేష్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పత్రిక విలేకరుల సమావేశంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పై మాజీ ఎంపీటీసీ అవర్ సురేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం మీడియా సమావేశంలో తోట లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ మిడిమిడి జ్ఞానంతో నిజాలు తెలుసుకోలేకుండా నోటికి వచ్చిందల్లా మాట్లాడారని ఆయన అన్నారు చరిత్రలోకి వెళ్లినట్లయితే బిచ్కుంద మండలంలో తోట లక్ష్మీకాంతరావు కు కనీసం నిల్చోడానికి కూడా నీడలేని సమయంలో కమల్ సెట్ చేరదీసి బిచ్కుంద మండలంలోని ప్రముఖ కాంగ్రెస్ సీనియర్ నాయకులను పరిచయం చేసి బిచ్కుంద మండలంలో ఆవాసం ఏర్పాటు చేసిన వ్యక్తిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం అంటూ ఆయన విచారం వ్యక్తం చేశారు. చిన్న చిన్న వ్యాపారుల వద్ద వంద రూపాయలు కలెక్షన్ చేసిన వ్యక్తి అని సంబోధించిన విషయంపై మాట్లాడుతూ బిచ్కుందలో ఒకానొక సందర్భంలో కరువు ఏర్పడగా బిచ్కుంద గ్రామ ప్రజలందరికీ కూడా కొన్ని రోజులపాటు భోజన వసతిని కల్పించిన కుటుంబం కేవలం 100 రూపాయలకు కక్కుర్తి పడింది అని సంబోధించడం ఎంతవరకు సమంజసనీయం మా కుటుంబం ఎక్కడైనా వసూలు చేసింది మీరు చూశారా లేక చెప్పింది విన్నారా అంటూ ఆయన ప్రశ్నించారు. ఇతరులను ప్రశ్నించే ముందు తమ స్థితిగతులను చూసుకోవాలని అన్నారు. రెవిన్యూ, ఆర్టీవో, విద్యాశాఖ లో మీరు చెప్పిన విషయం గురించి గానీ లేదా మీరు అడిగిన విషయం గురించి గానీ తీగ లాగితే ప్రతి ఉద్యోగి చెప్తారు మీరు ఏం అడిగారు?, ఏం ఇవ్వమన్నారు అని మా నాయకుడిపై ఆరోపణలు చేసే అర్హత ,స్థాయి మీకు ఏమాత్రం లేదని నిజామాబాద్ జిల్లా పరిషత్ ఆఫీస్ గోడల గురించి మాట్లాడే మీరు తమ నిజ స్వరూపం ఏమిటో గమనించుకోవాలని తమరి వ్యక్తిగతం గురించి హైదరాబాద్, సైబరాబాద్ ఏరియాలలో తమ గురించి ఏమనుకుంటారో అది మేం చెప్పవలసిన అవసరం లేదు అంటూ ఆయన చురకలు అంటించారు. నియోజకవర్గంలో అడ్రస్ లేని వ్యక్తిగా ఉన్న లక్ష్మీ కాంతారావును ప్రతి మండలంలో పరిచయం చేయించి 13 రోజుల్లో ఎమ్మెల్యేలు చేయించిన ఘనత మా నాయకుడిదని అలాంటి మేలుని మరిచి తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టిన విశ్వాస ఘాతకుడు తోట లక్ష్మీకాంతరావు అని ఘాటుగా దుయ్యబట్టారు. 13 రోజుల్లో ఎమ్మెల్యేగా గెలిపించిన కార్యకర్తలను, నాయకులను గాడిదలు, కోతులు అని సంబోధించిన వ్యక్తిత్వం నీది నీకెక్కడుంది విశ్వాసం. నీకెక్కడుంది పార్టీపై అభిమానం. కేవలం తన స్వలాభం కోసం వచ్చిన పారాషూట్ లీడర్ వి నువ్వు అంటూ ఆయన ఘాటుగా విమర్శించారు. ఇకమీదట నైన నిజాలు తెలుసుకొని మసులుకోకపోతే తమకే నష్టమని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ అవార్ సురేష్, తో పాటు పుల్లని వెంకట్ విమల్ కిషోర్ బట్టడ్ మొగులయ్య ఎక్స్ఎన్పిటిసి వాజిద్ నగర్, షేక్ పాషా సెట్, మరియు మండల సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
