- మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
మెండోరా, బతుకమ్మ : గత అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు కల్యాణ లక్ష్మి, షాధిముబారాఖ్ లబ్దిదారులకు నగదుతో పాటు తులం బంగారం ఇవ్వాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన కానిస్టెన్సీలోని మెండోరా మండలానికి చెందిన మంజూరుకు సిద్ధంగా ఉన్న కల్యాణ లక్ష్మి, షాది ముబారాఖ్ ఫైళ్ల పైన సంతకాలు చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హామీ ఇచ్చి రెండు ఏళ్ళు గడుస్తున్న ఇచ్చిన హామీని అమలు చేయడం లేదన్నారు. ఇప్పుడు మంజూరు అయ్యే ఈ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారాఖ్ లబ్దిదారులకు ఇచ్చిన హామీ మేరకు తులం బంగారం అందజేయాలనీ ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
