విద్యార్థులకు దుప్పట్ల పంపిణీ

0 15,489

భీమ్ గల్, బతుకమ్మ : శీతాకాలం కారణంగా చలి తీవ్రంగా ఉన్నందున ప్రభుత్వ హాస్టల్ లో చదువుతున్న విద్యార్థులకు లయన్స్ క్లబ్ భీమ్ గల్, వేముగళ్ళు ఆధ్వర్యంలో ఆదివారం దుప్పట్లను పంపిణి చేశారు. ఈ సందర్బంగా లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ పడాల పురందర్ మాట్లాడుతూ  ప్రతి విద్యార్థికి మెరుగైన సౌకర్యాలు కల్పించడం సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. “రేపటి పౌరులు అయిన విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, చలి బాధను మరిచిపోయి, కేవలం చదువుపై మాత్రమే దృష్టి సాదించాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాము,” అని తెలియజేశారు. లయన్స్ క్లబ్ ఎల్లప్పుడూ విద్య, వైద్యం, సామాజిక సేవ రంగాలలో చురుకుగా ఉంటుందని, ఈ దుప్పట్ల పంపిణీ కూడా అందులో భాగమేనని ఆయన వివరించారు. ఈ పంపిణీ ద్వారా 30 మంది విద్యార్థులకు దుప్పట్లు అందజేశామన్నారు. హాస్టల్ ఇంచార్జి వార్డెన్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సభ్యుల సహకారాన్ని కొనియాడారు. “విద్యార్థులకు ఈ సమయంలో దుప్పట్లు చాలా అవసరమని అన్నారు. ఈ కార్యక్రమం లో క్లబ్ సెక్రటరీ గజ్జల చైతన్య, హనుమండ్లు, పురస్తు లింబాద్రి, ప్రసాద్ రావు, డా. శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.