24 C
Hyderabad
Sunday, August 2, 2026

ఉత్తమ వాలంటీర్ గా కలిగోట ప్రశాంత్

Must read

📰 Generate e-Paper Clip

ఆర్మూర్, బతుకమ్మ :  లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ అధ్యక్షుడు చెరుకు పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వాలంటరీ దినోత్సవం పురస్కరించుకొని కలిగోట ప్రశాంత్ ను సన్మానించారు. మన హెల్పింగ్ హాండ్స్ బ్లడ్ డోనర్స్ ఫౌండేషన్ ద్వారా ఆపదలో ఉన్నవారికి సరైన సమయంలో రక్తాన్ని అందిస్తూ వారి ప్రాణానికి ఎలాంటి హాని జరగకుండా మనం చేస్తున్నటువంటి బ్లడ్ డొనేషన్ గుర్తించి మెమొంటో ,శాలువాతో సన్మానించారు.  రాబోయే రోజుల్లో మరింత సేవాలను విస్తృతం చేస్తూ ప్రజలలో సమాజంలో ,యువతలో చైతన్యం తేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ మెంబర్స్ రఫిక్, గుర్రం విజయనంద్ , పోల మధుకర్ ,శ్రీధర్  తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article