27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

జేఈఈ అడ్వాన్స్ 2025 ఫలితాలలో కాకతీయ విద్యార్థుల ప్రతిభ

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సోమవారం విడుదల చేసిన జేఈఈ అడ్వాన్స్ 2025 ఫలితాలలో కాకతీయ విద్యార్ధులు జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించారని కాకతీయ విద్యా సంస్థల చైర్ పర్సన్ సీహెచ్.విజయ లక్ష్మీ తెలిపారు. సాయి సర్వజిత్ 347,  శివ 1299, ఎం.శ్రీకాంత్ 6383, వేదాక్షర్ 9524 జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించారని తెలిపారు. ఐఐటీ, నీట్, ఎంసెట్ అకాడమిక్ డైరెక్టర్ సీహెచ్.రామోజిరావు మాట్లాడుతూ తమ విద్యార్థులు జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించి సత్తా చాటారని అన్నారు. కాకతీయ డైరెక్టర్ సీహెచ్.తేజస్వని మాట్లాడుతూ ఈ అత్యుత్తమ ఫలితాలు సాధించడానికి కాకతీయ ఐఐటీ, నీట్, ఎంసెట్ అకాడమీ లోని  ప్రత్యేక పాఠ్య ప్రణాళిక, యాజమాన్య నిరంతర పర్యవేక్షణ, వారాంతపు పరీక్షలే ముఖ్య కారణమని అన్నారు. ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కాకతీయ విద్యా సంస్థల ప్రిన్సిపల్ సందీప్ కులకర్ణి, వైస్ ప్రిన్సిపల్ విధిత గౌడ్, శ్యాం, జ్యోష్న, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

More articles

Latest article