27.5 C
Hyderabad
Friday, July 31, 2026

ఈఎప్ సెట్ ఫలితాలలో కాకతీయకు ర్యాంకుల పంట

Must read

📰 Generate e-Paper Clip

 

. . . పదుల సంఖ్యలో విద్యార్ధులకు ర్యాంకుల

 

నిజామాబాద్, బతుకమ్మ :

 

2026  ఈఎప్ సెట్  ఫలితాలలో కాకతీయ విద్యార్ధులకు ర్యాంకుల పంట పండింది. ఇంటర్‌తో పాటు తొలి ప్రయత్నంలోనే ఇంజనీరింగ్, అగ్రీకల్చర్ అండ్ ఫార్మసీ విభాగంలో అద్భుతమైన స్టేట్ ర్యాంకులు సాధించారు విద్యార్ధులు. ఆదివారం వెలువడిన 2026  ఈఎప్ సెట్  ఫలితాలలో అబ్దుల్ షాహిద్  ర్యాంక్ 3406, ఆత్రిజ్  ర్యాంక్ 3862, ఎ. వచన్  ర్యాంక్ 4974, భావకీర్తన్ ర్యాంక్ 5963, లోక సమిక్ష  ర్యాంక్ 6085, ఈ. శరత్ చంద్ర ర్యాంక్ 7003, సిద్ధి వినాయక్  ర్యాంక్ 7350, మైరతైతెల్  ర్యాంక్ 7390, సదియా ఫిర్దౌస్  ర్యాంక్ 7830, సుజానా  ర్యాంక్ 8450, తుబా ఫాతిమా  ర్యాంక్ 9666, ఐషా ఆలం ర్యాంకు 10990 లు స్టేట్ ర్యాంకులు సాధించారు.

 

Kakatiya gets a crop of ranks in the EFP SET results

 

ఈ సంధర్బంగా ఆదివారం కళాశాల ఆవరణలో కాకతీయ రెసిడెన్షియల్ కాలేజ్ విద్యార్థులను కళాశాల యాజమాన్యం,  అధ్యాపక బృందం అభినందించింది.

 

Kakatiya gets a crop of ranks in the EFP SET results

 

ఈ సందర్భంగా కళాశాల చైర్ పర్సన్ సిహెచ్.విజయలక్ష్మి మాట్లాడుతూ  విద్యార్థులు క్రమశిక్షణతో చదువుతూ అధ్యాపకుల మార్గదర్శకత్వంలో లక్ష్యసాధనకు కృషి చేయడం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని తెలిపారు. ఇంటర్మీడియట్ చదువుతో పాటు ఈ ఎప్ సెట్ కు ప్రత్యేక శిక్షణ అందించడం ద్వారా విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారని పేర్కొన్నారు. ఈ సంవత్సరం ఈఎప్ సెట్ లో కళాశాలకు చెందిన విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని తెలిపారు. అదే విధంగా  నిజామాబాద్ జిల్లాలో కొన్ని విద్యాసంస్థలు వివిధ బ్రాంచ్‌లలో వచ్చిన స్టేట్ ర్యాంకులను తమ బ్రాంచ్‌కు చెందినవిగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో  తల్లిదండ్రులు సరైన సమాచారాన్ని తెలుసుకుని నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

 

Kakatiya gets a crop of ranks in the EFP SET results

 

కాకతీయ విద్యాసంస్థల పరిధిలోని కాకతీయ రెసిడెన్షియల్ కాలేజ్ విద్యార్థులు సాధించిన ఈ ర్యాంకులు ఒకే బ్రాంచ్ నుండే వచ్చినవని స్పష్టం చేశారు. పారదర్శకత,  నాణ్యమైన బోధన,  క్రమశిక్షణతో కూడిన విద్యా విధానమే ఈ విజయాలకు ప్రధాన కారణమని యాజమాన్యం వెల్లడించింది. విద్యార్థుల ఈ విజయాలకు కారణమైన తల్లిదండ్రులు, అధ్యాపకులు యాజమాన్యానికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

 

Kakatiya gets a crop of ranks in the EFP SET results

More articles

Latest article