ఇందల్వాయి,బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని నల్లవెల్లి గ్రామం లో ఘనంగా మహాత్మ జ్యోతిరావు ఫూలే జయంతి పురస్కరించుకొని ఇందలవాయి మండలంలో మహాత్మ జ్యోతిరావు ఫూలే జయంతి సందర్బంగా బిజెపి జిల్లా అధ్యక్షులు.కులాచారి.దినేష్ కుమార్ ఆధ్వర్యంలో జ్యోతిరావు ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.కులం పేరుతో తరతరాలుగా అణచివేతకు గురైన దళిత,బడుగు, బలహీనవర్గాల హక్కుల కోసం పోరాడిన మహనీయుడు మహాత్మ జ్యోతిరావు ఫూలేఅని అన్నారు. అలాగే “గావ్ ఛలో అభియాన్” కార్యక్రమంలో భాగంగా నల్లవెల్లీ గ్రామంలో దళిత వాడలను సందర్శించి నరేంద్ర మోదీ ప్రభుత్వం దళితుల అభ్యున్నతికి చేస్తున్న కృషిని తెలియజేశారు.నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ చిత్రపటానికి పార్లమెంట్ లో ఏర్పాటు చేయడం జరిగింది.అంబేద్కర్ పుట్టి,పెరిగి,నివసించిన,చదువుకున్న ప్రాంతాలను పంచతీర్ధాలుగా గుర్తించడం జరిగిందని అన్నారు.అంబేద్కర్ కలలుగన్న సమసమాజం కోసం కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుంది అని తెలిపారు.గన్నారం గ్రామంలోని అంగన్ వాడి కేంద్రాన్ని సందర్శించి,అక్కడ గర్భిణీ స్త్రీలతో,వైద్య సిబ్బందితో మాట్లాడి,కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పౌష్టిక ఆహారం,టీకాల లభ్యత,అమలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు లోలం సత్యనారాయణ, మోహన్ రెడ్డి, బిజెపి నాయకులు, గ్రామ మహిళలు పాల్గొన్నారు.
