బతుకమ్మ భిక్కనూరు: మహాత్మ జ్యోతిబాపూలే జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని భిక్కనూరు మండలంలోని అహ్మద్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎండి హనీఫ్ పాషా అన్నారు. శుక్రవారం కళాశాలలో మహాత్మ జ్యోతిబాపూలే 199 వ జయంతి నిర్వహించారు. ఈ సందర్బంగా కళాశాల ఉపాధ్యాయులు,చాత్రోపాధ్యాయులు జ్యోతిబాపూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఆయన త్యాగాలను, సమాజానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. సామాన్యుడిగా మొదలై.. సామాజిక ఉద్యమ కెరటంగా ఎదిగిన పూలే జీవితం అందరికీ ఆదర్శనీయమన్నారు. సామాజిక కార్యకర్తగా, వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన సంఘ సంస్కర్త పూలే భావి తరాలకు సైతం మార్గదర్శకుడని గుర్తు చేసుకున్నారు. సమాజంలో వివక్షకు తావు లేదని, సమానత్వం ఉండాలని జీవితాంతం పోరాడిన మహనీయుడు స్త్రీవిద్యను తాను చేసిన సేవలను స్మరిస్తూ అతని జీవితం అందరికీ ఆదర్శనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో,ఉపాధ్యాయులు, ఛాత్రోపాధ్యాయులు పాల్గొన్నారు.
