24.7 C
Hyderabad
Monday, August 3, 2026

సామాన్యులకు మెరుగైన వైద్యం అందినప్పుడే వైద్య వృత్తికి న్యాయం జరుగుతుంది

Must read

📰 Generate e-Paper Clip

మెట్రో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం లో అర్బన్ ఎమ్మెల్యే

నిజామాబాద్ సిటీ బతుకమ్మ : వైద్యో నారాయణ హరి అని పెద్దలు అంటారని మనుషులకు జన్మను ఆ భగవంతుడు ఎలా ప్రసాదిస్తాడో అలాగే ఏదైనా అత్యవసర ప్రమాదాలలో వైద్యులు కూడా పునర్జన్మను ప్రసాదిస్తారని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. ఆదివారం ద్వారకా నగర్ లోని మెట్రో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ఆయన ప్రారంభించారు. డాక్టర్ ప్రశాంత్ ఫిజీషియన్ ఎన్నో ఏళ్లుగా అనుభవం ఉన్న వైద్యుడు అని ఎంతో మంది రోగులకు తన వైద్యంతో నయం చేసిన అనుభవం ఆయనది అని అన్నారు. తన అనుభవంతో స్వతహాగా ఒక హాస్పిటల్ ను నిర్మించి పేద ప్రజల కోసం అత్యాధునిక వైద్య సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. రాబోయే రోజుల్లో ఈ హాస్పిటల్కు మంచి పేరు రావాలని ఆకాంక్షించారు.

Justice will be done to the medical profession only when the common man gets better treatment

More articles

Latest article