24 C
Hyderabad
Sunday, August 2, 2026

రసవత్తరంగా కుస్తీ పోటీలు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ పిట్లం : పిట్లం మండల కేంద్రంలోని గడి హనుమాన్ వద్ద శ్రీరామనవమి పురస్కరించుకొని మంగళవారం నాడు కుస్తీ పోటీలు నిర్వహించారు. ఈ కుస్తీ పోటీలకు మహారాష్ట్ర కర్ణాటక నుండి పెద్ద ఎత్తున మల్లయోధులు వచ్చారు. ఉదయం నుండి చిన్న పిల్లల నుండి కుస్తీ పోటీలు  కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు. 50 రూపాయల నుండి 500 వరకు మధ్యాహ్నం రెండు గంటల వరకు కుస్తీ పోటీలు నిర్వహించారు. మల్ల యోధులకు భోజన సదుపాయం కూడా కల్పించారు. మధ్యాహ్నం నుండి 500 రూపాయల నుండి 1500 వరకు కుస్తీ పోటీలు నిర్వహించారు. లాస్ట్ బహుమతి 2000 రూపాయలు నిర్వహించి కుస్తీ కుస్తీ పోటీలు ముగించారు. ఈ కార్యక్రమంలో కుస్తీ పోటీ నిర్వాహకులు మోహన్ రెడ్డి, రామ్ రెడ్డి, శివ, హనుమా అశోక్, శ్రీనివాస్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

More articles

Latest article