నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జమ్మూకశ్మీర్ కేంద్రపాలిత రాష్ట్రమైన పహాల్గామ్ లో టెర్రరిస్టులు దాడిలో అమరులైనవారికి నిజామాబాద్ జిల్లా న్యాయవ్యవస్థ నివాళులు అర్పించారు. మంగళవారం జిల్లాకోర్టు ప్రాంగణంలోని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.వి.ఎన్ భరత లక్ష్మీ తన కోర్టు హల్ లో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తో కలిసి రెండు నిమిషాలు మౌనం పాటించి పహాల్గామ్ లో ఉగ్రవాదుల తుపాకీ తూటాలకు బలైన మృతవీరులకు అశ్రునివాళులర్పించారు.నిజామాబాద్ రెండవ అదనపు జిల్లాజడ్జి టి.శ్రీనివాస్, మూడవ అదనపు జిల్లాజడ్జి ఆశాలత, నాల్గవ అదనపు జిల్లాజడ్జి హరీష,సీనియర్ సివిల్ జడ్జి సాయిసుధ, జూనియర్ సివిల్ జడ్జిలు కుష్బూ ఉపాధ్యాయ్, గోపీ కృష్ణ,శ్రీనివాసరావు, హరి కుమార్ తమ తమ కోర్టు హల్ లలో లేచినిలబడి న్యాయవాదులు, కోర్టు సిబ్బందితో కలిసి రెండు నిమిషాలపాటు నివాళులు అర్పించారు. నివాళి కార్యక్రమంలో నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిల్ల సాయరెడ్డి, ప్రధాన కార్యదర్శి మానిక్ రాజ్,తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు మంథని రాజేందర్ రెడ్డి, పిపి.రాజేశ్వర్ రెడ్డి,ప్రభుత్వ న్యాయవాది అమిడాల సుదర్శన్, సీనియర్ న్యాయవాదులు అజార్ కిషన్ రావు,ఎర్రం గణపతి,మధుసూదన్ రావు,ఆశ నారాయణ, బార్ ఉపాధ్యక్షుడు దిలీప్ తదితరులు పాల్గొన్నారు.
నివాళి అనంతరం కోర్టు హాల్ బయట బార్ కౌన్సిల్ సభ్యులు మంథని రాజేందర్ రెడ్డి ఒక కవితను వినిపించారు.
ఒక మౌనం ,ఒక నివాళి
భరతావని అమ్ములపొదిలో ఉన్న
అస్రాలు అవుతాయి
గురి చూసి కొడితే
పాకిస్థాన్ అనే శత్రువు
గింగిరులు తిరిగి
మట్టిలో కలవాల్సిందే
నా సింధు(హిందు)నది నుండి పారే నీళ్లలోని
బురదలో ,నీళ్ళలో మునిగి చావవలసిందే
నా దేశపు ఓపికకు
హద్దులుండే కానీ
హద్దులను చెరిపి వేసుకుని
నీ ఉగ్రవాదానికి
నీ పెంపుడు తనానికి
శాశ్వత సమాధి కట్టడానికి
సమాయత్తం అవుతున్న
నాకు సమయం ఆసన్నమైంది
అస్రాలను సందిస్తున్న
“ఆక్రమాన్ “తో
నిన్ను అక్రమించేస్తా
పాకిస్థాన్ అనేది
ప్రపంచ పటంలో
లేకుండా జేస్తా….
