పహాల్గామ్ అమరులకు”జ్యూడిషియరీ”నివాళి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జమ్మూకశ్మీర్ కేంద్రపాలిత రాష్ట్రమైన పహాల్గామ్ లో టెర్రరిస్టులు దాడిలో అమరులైనవారికి నిజామాబాద్ జిల్లా న్యాయవ్యవస్థ నివాళులు అర్పించారు. మంగళవారం  జిల్లాకోర్టు ప్రాంగణంలోని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.వి.ఎన్ భరత లక్ష్మీ తన కోర్టు హల్ లో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తో కలిసి రెండు నిమిషాలు మౌనం పాటించి పహాల్గామ్ లో ఉగ్రవాదుల తుపాకీ తూటాలకు బలైన మృతవీరులకు అశ్రునివాళులర్పించారు.నిజామాబాద్ రెండవ అదనపు జిల్లాజడ్జి టి.శ్రీనివాస్, మూడవ అదనపు జిల్లాజడ్జి ఆశాలత, నాల్గవ అదనపు జిల్లాజడ్జి హరీష,సీనియర్ సివిల్...