26.3 C
Hyderabad
Monday, August 3, 2026

సంస్కృతి, సంప్రదాయలకు నిలువుటద్దం ‘జడ్జి కనక దుర్గ ‘

Must read

📰 Generate e-Paper Clip

  • ఒకరే కుటుంబ బాధ్యత మోశారు
  • ధానంలో మిన్న, గుప్తదానం ఎంతో
  • జిల్లా జడ్జీ భారత లక్ష్మీ

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పెద్ద కుటుంబంలో అన్ని తానై పెద్దదిక్కుగా నిలిచిన జడ్జి కనక దుర్గ అందరికి ఆదర్షప్రాయురాలని నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. వి. ఎన్ భారత లక్ష్మీ అన్నారు.నిజామాబాద్ మొదటి అదనపు జిల్లాజడ్జి కనక దుర్గ పదివి విరమణ సందర్బంగా నిజామాబాద్ బార్ అసోసియేషన్ జిల్లాకోర్టు ప్రాంగణంలోని సమావేశపు హల్ లో ఏర్పాటు చేసిన వీడ్కోలు సభలో ఆమె న్యాయవాదులను ఉద్దేశించి ప్రధానోపన్యాసం చేశారు.నేటి గజిబిజి సంస్కృతికి భిన్నంగా ఆధ్యాత్మిక సంస్కృతిని ఉట్టిపడే విదంగా కట్టుబొట్టుతో ఉండటం భక్తి ప్రపత్తులకు నిదర్శనమని తెలిపారు.ధానం చేయడంలో గొప్పవారని, మరెన్నో గుప్తధానాలు చేసి ఉంటారని అన్నారు.మంచి గుణాల తల్లి, బిడ్డగా పేరుగాంచరని జడ్జి భారత లక్ష్మీ పేర్కొన్నారు.అదనపు జిల్లాజడ్జిగా పదవి విరమణ చేసిన కనక దుర్గ మాట్లాడుతూ తన కుటుంబం చదువు ఆడపిల్లకు ముఖ్యమని తెలుసుకుని చదివించారని తెలిపారు. నాన్న ధైర్యం నూరిపోసి నడిపించారని నేటికీ నాన్న వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నరని అన్నారు.జడ్జిగా నియమాకం అయిన అనంతరం విధుల నిర్వహణలో చంపి వేస్తామనే బెదిరింపులు వచ్చాయని వాటిని తట్టుకుని నేటి వరకు నిలబడ్డామని తెలుపుతు, మహిళలు వృత్తిలో గుండె నిబ్బరంతో వెళ్లాలని కోరారు.జీవిత పయనంలో తీయదనం, పులుపు, కారం, చేదు అన్ని ఉంటాయని తెలుపుతు సమాజం పట్ల ఎప్పుడు కృతజ్ఞతభావంతో ఉంటానని ఆమె తెలిపారు. మొదట్లో జడ్జిగా మాట్లాడం ఎలాగో తెలియక పోయేదని కాని న్యాయసేవ సంస్థ పదిమందు ముందు మాట్లాడం నేర్పిందని అన్నారు. అనుకూల దృక్పదంతో ఉండాలని, అనుకున్నవన్నీ జరుగుతాయని తెలిపారు. మైసూరు దత్తఠాదీషులు శ్రీశ్రీ గణపతి సచ్చిథానంద స్వామి ఆశీస్సులు, ఆశీర్వాదాలు విధుల నిర్వహణలో ప్రేరణ శక్తిగా నిలుస్తున్నాయని జడ్జి కనక దుర్గ తెలిపారు.నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిళ్ల సాయరెడ్డి మాట్లాడుతు రెండు సంవత్సరాల పైచిలుకు పదవి నిర్వహణలో అదనపు జిల్లాజడ్జిగా అందరి ఆధరాభిమానాలు చురగొన్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు మంథని రాజేందర్ రెడ్డి ప్రసంగిస్తు న్యాయశాస్త్రంలో బహుముఖ తెలివితేటలు జడ్జి కనక దుర్గ సొంతమని అన్నారు.బార్ ప్రధాన కార్యదర్శి మాణిక్ రాజు వీడ్కోలు సంధాన కర్తగా వ్యవహారించారు. అనంతరం బార్ కార్యవర్గం జడ్జి కనక దుర్గను మేమెంటో, శాలువతో ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో బార్ ఊధ్యక్షుడు దిలీప్, సంయుక్త కార్యదర్శి ఝాన్సిరాణి, కోశాధికారి నారాయణ దాసు, లైబ్రరీ కార్యదర్శి  శ్రీమాన్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాధస్తు రాజారెడ్డి, ప్రభుత్వ న్యాయవాది ఆమిదాల సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

'Judge Kanaka Durga' is a mirror of culture and traditions

More articles

Latest article