29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

వక్ఫ్ బోర్డు రక్షణ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు

Must read

📰 Generate e-Paper Clip

  • వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగానికి వ్యతిరేకం
  • మత నాయకుల ఐక్య పిలుపు

 

భైంసా, బతుకమ్మ: భైంసా పట్టణంలో “వక్ఫ్ బోర్డు రక్షించండి – రాజ్యాంగాన్ని కాపాడండి” ఉద్యమం కొరకు జాయింట్ ఎక్షన్ కమిటీ ఏర్పాటు చేశారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు మస్జిద్ ఉస్మాన్‌లో వివిధ మత నాయకుల సమావేశం జరిగింది. ఇందులో వివిధ మతాల పెద్దలు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, సమాజ సేవకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఫ్తీ అబ్దుల్ గనీ ఖాసిమీ (జమీయతుల ఉలమాఇ హింద్, ఆదిలాబాద్) మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లు 2025 రాజ్యాంగానికి వ్యతిరేకమని, ఇది మస్జిద్లు, మదరస్సాలు, కబ్రస్తాన్‌లకు నష్టం కలిగించేలా ఉందని చెప్పారు. మౌలానా షాహిద్ గఫ్రాన్ ఖాసిమీ మాట్లాడుతూ, అన్ని మతాల పెద్దలు కలిసి సమావేశమవడం ఐక్యతకు సంకేతమని, ఈ ఉద్యమం శాంతియుతంగా, దీర్ఘకాలికంగా సాగుతుందని తెలిపారు. మొబీన్ అహ్మద్ (జమాత్ ఇస్లామీ, భైంసా) మాట్లాడుతూ, ముస్లింలతో పాటు దళితులు, క్రిస్టియన్లు, ఇతర మతాల వారిని కూడా ఈ ఉద్యమంలో చేర్చుకోవాలి అన్నారు.

ఇతర ప్రసంగించినవారిలో హాఫిజ్ ఖాలిద్ మొహమ్మదీ, హాఫిజ్ మునీర్, హాఫిజ్ అబ్దుల్ లతీఫ్, ముఫ్తీ షహబాజ్ నవాజ్, సయ్యద్ లతీఫ్, అయూబ్ అహ్మద్, ఫయుజుల్లా ఖాన్ (ఎంఐఎం), ఫారూక్ అహ్మద్ సిద్ధిఖీ, మునీర్ అహ్మద్ అడ్వొకేట్, ముహమ్మద్ ఖలీమ్ ఉన్నారు. కార్యక్రమంలో ముఫ్తీ ఖాలిద్ గఫ్రాన్, మౌలానా సల్మాన్, మౌలానా రియాజ్, మౌలానా రాఫె, మౌలానా యూనుస్, మహ్మద్ ఆమిర్ అహ్మద్ (మాజీ కౌన్సిలర్), సయ్యద్ షాహిద్ (కాంగ్రెస్), మక్సూద్ ఖాన్, లతీఫ్, హఫీజ్‌ల్లా ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article