బతుకమ్మ : నాగిరెడ్డిపేట : బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడి సొంత గ్రామంలో సోమవారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వాడి గ్రామ మాజీ సర్పంచ్ ఆరే అనూష పర్వత్ రావు సమక్షంలో వాడి గ్రామానికి చెందిన కోడే హన్మంత్, పుట్టి నర్సింలు, అల్లూరి మల్లయ్య లు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులు, ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు, పేద, బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని, రాబోయే రోజుల్లో స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వాడి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పర్వత్ రావు, ఎల్లారెడ్డి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉప అద్యక్షుడు గులాం హుస్సేన్, తదితరులున్నారు.
