రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ గ్రామ శివారులో వాహనాలు తనిఖీలు చేస్తుండగా, మండలంలోని సులేమాన్ నగర్ గ్రామానికి చెందిన భవానిపేట్ సతీష్ గౌడ్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడటంతో సోమవారం బోధన్ కోర్టులో ఆ వ్యక్తిని హాజరు పరుచగా సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శేష తల్ప సాయి రెండు రోజులు జైలు శిక్ష విధించినట్లు తీర్పు వెల్లడించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని రుద్రూర్ ఎస్సై సాయన్న పేర్కొన్నారు.