- పదేళ్లు పాలించిన కెసిఆర్ ఒక్క ఉద్యోగాన్ని ఇవ్వని చేతగాని సీఎం
- మాజీమంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రాష్ట్రంలో అధికారం వచ్చిన కేవలం 9 నెలల్లోని కాంగ్రెస్ ప్రభుత్వంనిరుద్యోగుల సమస్యలను పరిష్కరిస్తూ, వేల ఉద్యోగాలను భర్తీ చేస్తున్న ప్రభుత్వం తమదని మాజీమంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిపేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో ని గోనె రెడ్డి కళ్యాణ మండపంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్గా ప్రమాణస్వీకారం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. మొదటగా అంట రెడ్డి రాజారెడ్డి, హాజరైన బోధన్ ఎమ్మెల్యేకు అభిమానులు కాంగ్రెస్ పార్టీ నాయకులు గజమాలతో స్వాగతం పలికారు. అనంతరం రాజారెడ్డిని తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్ఆయనచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుద్యోగ భృతి ఉద్యోగాల భర్తీకాంగ్రెస్ పార్టీతోనే

సాధ్యమవుతుందని,పదేళ్లపాటు అధికారంలో ఉన్న టిఆర్ఎస్పార్టీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్రాష్ట్రంలోఒక్క ఉద్యోగాన్ని భర్తీ చేయకపోగానిరుద్యోగుల సమస్యలనుపరిష్కరించడంలో విఫలమయ్యారని విమర్శించారు. నీళ్లు నిధులు నియామకాల పేరుతో అధికారంలోకి ఎక్కిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పదేళ్లు పాలించిన రాష్ట్రంలో ఒక్క ఉద్యోగాన్ని కూడా ఇవ్వని చేతగాని దద్దమ్మ సీఎంకెసిఆర్ అని మండిపడ్డారు. అనంతరం పలువురు నూతన గ్రంథాలయ చైర్మన్ ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ ఛైర్మెన్తాహెర్బీన్ హంధాన్, నూడా చైర్మన్ కేశ వేణు, సీనియర్ నాయకులు నరాల రత్నాకర్, గడుగు గంగాధర్, అరికెల నర్సారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

