28.8 C
Hyderabad
Monday, August 3, 2026

డ్రైవర్ల అజాగ్రత్తతో హమాలీల ప్రాణం హరి

Must read

📰 Generate e-Paper Clip

  • మొన్న తాళ్లపల్లిలో నేడు కొండాపూర్ లో
  • ఇద్దరు హమాలీల బలి

 

సిరికొండ, బతుకమ్మ : డ్రైవర్లు అజాగ్రత్తగా వాహనాలు నడపడం మూలాన ఎదుటి నిండు ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయి. రోడ్ల మీద రోజు రోజు ప్రమాధాలు పెరిగిపోయి ఎన్నో ప్రాణాలు హరి అంటుంటే,  ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వడ్లను లోడ్ చేసుకొని తీసుకు వెళ్లేందుకు వచ్చే లారీలు, వడ్లు పొలాల నుండి తెచ్చి పొసే ట్రాక్టర్ల డ్రైవర్ల అజాగ్రత్త గా నడపడం మూలన ఈ రెండు, మూడు రోజుల్లో ఇద్దరి ప్రాణాలు హరి మన్నాయి. మరో ఇద్దరు తీవ్రగాయాల పాలై చికిత్స పొందుతున్నారు. గత శుక్రవారం భీమ్ గల్ మండలం తాళ్లపల్లి సొసైటీలో వడ్లు తూకం వేసి, లారీల్లో లౌడ్ చేసేందుకు హమాలి పని పై వచ్చిన బీహార్ కు చెందిన 21 సంవత్సరాల యువకుడు  పైకి ఓ డ్రైవర్ అజాగ్రత్తగా లారీని ఎక్కించాడు. దాంతో ఆయువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ విధారక సంఘటనను ప్రజలు మరువక ముందే సిరికొండ సొసైటీ పరిధిలోని కొండాపూర్ గ్రామంలో వడ్లు తూకం వేసి లారీల్లో లౌడ్ చేసేందుకు బీహార్ నుండి హమాలి పనిపై వచ్చిన మరో వ్యక్తి పైకి ట్రాక్టర్ డ్రైవర్ అజాగ్రత్త డ్రైవింగ్ చేసి ఎక్కించడం కారణంగా ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మరొకటి చోటు చేసుకొంది. స్థానిక ఎస్సై రామ్ తెలిపిన వివరాల మేరకు ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం ధాన్యం కొనుగోలు కాంట వద్ద పని చేస్తున్న హమాలీలు భూమా శ్రీ ముత్తు, చింటూ కుమార్, గోవింద్ కుమార్లు పని చేస్తుండగా అక్కడికి వచ్చిన ఓ ట్రాక్టర్ డ్రైవర్ తప్ప త్రాగి అజాగ్రత్త గా ట్రాక్టర్ ను నడిపి వారిపైకి తీసుకెళ్లాడు. దాంతో భూమా శ్రీ ముత్తు(60) అక్కడికక్కడే మృతి చెందగా, చింటూ కుమార్, గోవింద్ కుమార్ అనే ఇద్దరు హమాలీలకు తీవ్ర గాయాలు అయ్యాయి. దాంతో క్షేత గాత్రులను చికిత్స నిమిత్తం డిస్ట్రిక్ట్ జనరల్ హాస్పిటల్ కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.

Drivers' carelessness leads to loss of lives of porters

More articles

Latest article