మున్సిపల్ ఎన్నికల్లో బరిలో జనసేన
భీంగల్, బతుకమ్మ : రానున్న మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులు కౌన్సిలర్ స్థానాలకు బరిలో ఉంటారని జనసేన బాల్కొండ నియోజకవర్గం కో ఆర్డినేటర్ శివసారి ఫణింద్ర తెలిపారు. శనివారం జనసేన పార్టీ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతు జనసేన రాజకీయ వ్యూహాన్ని వెల్లడించారు. మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 12 వార్డులలో జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేయబోతున్నారని, ప్రజా సేవ చేయాలనే తపన, నిబద్ధత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. ఆసక్తి కలిగిన...