27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో జైలు.. జరిమాన..

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ డివిజన్ పరిధిలో అతిగా మద్యం సేవించి వాహనాలు నడిపిన 5గురికి జైలు, 16మందికి జరిమానా స్పెషల్ జుడిషియల్ 2వ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ విధించినట్లు నిజామాబాద్ ఏసీపీ రాజావెంకట్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ డివిజన్ పరిధిలో డ్రంక్ డ్రైవ్ లో పట్టుబడిన వారికి  మంగళవారం కౌన్సిలింగ్ నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం జిల్లా కోర్టులో హాజరు పరుచగా స్పెషల్ జుడిషియల్ 2వ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ 5గురికి జైలు, 16మందికి జరిమానా విధించినట్లు తెలిపారు.  ప్రజలు మద్యం సేవించి వాహనాలు నడపరాదని, వాహనదారులు తమ వాహనాలకు సంబంధించి పత్రాలను సక్రమంగా ఉంచుకోవాలని సూచించారు.

More articles

Latest article