డ్రంక్ అండ్ డ్రైవ్ లో జైలు, జరిమాన

0 14,537

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : మద్యం తాగి వాహనాలు నడిపిన 12మందిలో సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ నలుగురికి జైలు శిక్ష, 8మందికి జరిమానా విధించినట్లు ట్రాఫిక్ ఇన్స్ పెక్టర్ ప్రసాద్ తెలిపారు. ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశాల ప్రకారం డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన 12మందికి బుధవారం కౌన్సిలింగ్ నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం సెకంట్ క్లాస్ మెజిస్ట్రేట్ మందు హాజరు పరచగా నిజామాబాద్ లోని అంబేద్కర్ కాలనికి చెందిన అరుణ్, గాజుల పేట్ కు చెందిన రవి, వీరన్న గుట్టకు చెందిన శ్రీనివాస్ కు మూడు రోజుల జైలు శిక్ష, నిజామాబాద్ కు చెందిన వాఘమారే గజానన్ కు రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.