27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

జగ్జీవన్ రాం సేవలు చిరస్మరణీయం

Must read

📰 Generate e-Paper Clip

నివాళులు అర్పించిన బార్ అసోసియేషన్

నిజామబాద్, బతుకమ్మ : బాబూ జగ్జీవన్ రాం జయంతి సందర్భంగా నిజామబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టులో గల సమావేశ హాల్లో శనివారం బాబు జగ్జీవన్ రాం చిత్రపటానికి బార్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రావు ఈ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు.  ఆయన దేశానికి అందించిన సేవలను కొనియాడారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేశాడన్నారు. నేటి యువత జగ్జీవన్ రాంను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో న్యాయవాదులు బంటు వసంత్, కిరణ్ కుమర్ గౌడ్, మాణిక్ రాజ్, ఆశా నారాయణ, ఎర్రం విగ్నేష్ ,భూమేశ్వర్, మేదరిశేఖర్, ఎస్ అశోక్, గోపాల్ రెడ్డి, రఘువీర్, చరణ్, నారాయణదాసు, రవి రాజ్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article