కుంగింది బ్యారేజ్ కాదు మీ బ్రెయిన్

0 18,995
  • ఎత్తిపోతలకు మోటర్ ఆన్ చెయ్యమంటే బ్యారేజ్ కుంగిందంటారెంటి?
  • అవగాహన లేక అజ్ఞానాన్ని బయట పెట్టుకొంటున్న ఉత్తమ్ కుమార్
  • మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

 

హైదరాబాద్, బతుకమ్మ : కాళేశ్వరం నుండి నీరు వృధాగా పడిపోతున్నాయని, మోటార్లు ఆన్ చేసి రైతులకు నీళ్లు ఇవ్వమంటే బ్యారేజ్ కుంగిందని అసంబద్ధమైన, అవగాహన లేని మాటలు మాట్లాడడం సబబు కాదని, కుంగింది బ్యారేజ్ కాదని, కుంగింది మంత్రి ఉత్తమ్ కుమార్ బ్రెయిన్ నని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బ్యారేజ్ కుంగడం, మోటార్లు ఆన్ చేయడానికి ఏమి సంబంధమని ఆయన ఉత్తమ్ కుమార్ ను ప్రశ్నించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి తీరు బోడిగుండుకు మోకాలికి ముడి పెట్టినట్లు ఉందని, ఆయన నీటి పారుదల శాఖ మంత్రి అయి ఉండి, శాఖ పరమైన అవగాహన లేక తన అజ్ఞానాన్ని తానే బయట పెట్టుకొంటున్నారని అన్నారు.కన్నెపల్లి పంప్ హౌస్ గుండా మినుమం డ్రాలెవల్ 93.5 అయితే 96 మీటర్ల ఎత్తున నీళ్లు ప్రవహిస్తున్నాయని, కన్నెపల్లి పంప్ ఆన్ చేసి నీటిని ఎత్తివేయాలని బీయర్ యస్ తరపున ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మోటార్లు ఆన్ చేసి పొలాలకు నీళ్లు ఇవ్వాలని మేం అడిగితే, కుంగిన బ్యారేజ్ నుంచి ఎత్తిపోయాలా అని ప్రశ్నించడం విడ్డురంగా ఉందన్నారు.అసలు బ్యారేజీ కి, మోటార్లు ఆన్ చేయడానికి ఎలాంటి సంబంధం లేదని,గోదావరి నీళ్లు రైతులకు  ఇవ్వమంటే బురుద రాజకీయాలు మాట్లాడుతూ నీళ్లు వృధాగా కిందికి వదులుతున్నారని అన్నారు. గత ప్రభుత్వం లో283 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించిన రికార్డు ఎలా సాధ్యం అయ్యిందని ఉత్తంను ఆయన ప్రశ్నించారు. ప్రజా ప్రభుత్వం అని చెప్పుకొంటున్న 19 నెలల పాలనలో ఒక్క ప్రాజెక్టు కట్టారా? ఒక్క చెక్ డాం నిర్మించారా? ఒక్క చెరువు పూడిక తీశారా? కొత్తగా మీరు చెందిన ఏమి లేదన్నారు.

Leave A Reply

Your email address will not be published.