28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

అనుమానస్పద మృతి కాదు హత్యే…

Must read

📰 Generate e-Paper Clip

 

. . . కుమారుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

 

. . . మాయాపూర్ కేసును చేధించిన నందిపేట్ పోలీసులు

 

నందిపేట్ , బతుకమ్మ :

 

నందిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాయాపూర్ గ్రామానికి చెందిన పుంటికూర ముత్యం ది అనుమానస్పద మృతి కాదు హత్యగా తేల్చారు పోలీసులు. మాయాపూర్ కు చెందిన పుంటికుర ముత్యం అనుమానస్పద మృతి గా నందిపేట్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు నందిపేట్ ఎస్ఐ శ్యామ్ రాజ్ తెలిపారు. ఎస్ఐ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి… పుంటికుర ముత్యం కు భార్య లలిత, ఒక కొడుకు, ఒక కుతూరు ఉన్నారు. వ్యవసాయం చేస్తు జీవనం సాగించే ముత్యంకు పొరుగున ఉన్న ఊరుకు చెందిన మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఆ కారణంగా గతంలో ఎకరం భూమి విక్రయించారు. అంతే గాకుండా ఇటీవల కాలంలో 8 నుంచి తొమ్మిది తులాల బంగారు ఆభరణాలను విక్రయించడంతో ఇంటిలో గొడవలు జరుగుతున్నాయి. కుటుంబ ఆర్థిక సమస్యలు, మృతుడి అక్రమ సంబంధ కారణంగా తాము రోడ్డున పడతామని అతని భార్య లలిత, కుమారుడితో  కలిసి ఈ నెల 6న ముత్యం తన ఇంటిలొ మద్యం సేవించి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో చీర అంచుముక్కతో మెడ బిగించి హత్య చేయగా, కొడుకు కాళ్లు పట్టుకొని సహకరించినట్లు విచారణలో తేలింది. అనంతరం ఎవరికి అనుమానం రాకుండా మద్యం మత్తులో మంచం మీద నుండి పడిపోయి చనిపోయినట్లుగా నమ్మించే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. మృతుడి కుటుంబ సభ్యులకు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీస్ విచారణ చేపట్టి ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నారు. ఈ కేసులో పుంటికూర లలిత, ఆమె కొడుకు లను కోర్ట్ ముందు హాజరు పరుచగా నేరానికి ఉపయోగించిన చీర ముక్క, చెద్దరి కత్తెరను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్ కు పంపినట్లు ఎస్ఐ శ్యామ్ రాజు వెల్లడించారు.

More articles

Latest article