27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ర్యాంకులు సాధించే విధంగా తయారు చేయడం గొప్ప విషయం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ప్రముఖ విద్యావేత్త నరాల సుధాకర్

 

. . . జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో బన్సల్ జూనియర్ కాలేజీ విద్యార్థుల ప్రభంజనం

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నిజామాబాదులోనే  విద్యార్థులు ఉండి చదివి ర్యాంకులు సాధించే విధంగా తయారు చేయడం గొప్ప విషయమని ప్రముఖ విద్యావేత్త నరాల సుధాకర్ అన్నారు. నిజామాబాద్ నగరంలో జేఈఈ మెయిన్స్ పరీక్షలో అద్భుతమైన మార్కులు సాధించి విజయకేతనం ఎగురవేసిన బన్సల్ జూనియర్ కళాశాల విద్యార్థులని మంగళవారం కళాశాల డైరెక్టర్ మేకల లక్ష్మణ్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు రవితేజ(96.66), ఆకుల శ్రీ హర్ష (99.47), నరసింహ(91.66), త్రిష (89.21) లకు మంగళవారం కళాశాల ఆవరణలో వారి తల్లిదండ్రుల సమక్షంలో సన్మానించారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ కళాశాల స్థాపించిన రెండవ సంవత్సరంలోనే మొదటిసారి జేఈఈ మెయిన్స్ పరీక్ష రాసి అద్భుతమైన విజయాలు సాధించడం గొప్ప విషయమని అన్నారు. ఈ విద్యార్థుల విజయం వెనక కళాశాల లెక్చరర్ల కృషి ఎంతో ఉందని అన్నారు. రాబోవు జేఈఈ అడ్వాన్స్ పరీక్షలో బన్సల్ జూనియర్ కళాశాల విద్యార్థులు మంచి ర్యాంకు ఖచ్చితంగా సాధిస్తారని అన్నారు. హైదరాబాద్, విజయవాడ లాంటి సుదూర ప్రాంతాలకు తమ బిడ్డలను పంపే బాధ ఇకముందు జిల్లా తల్లిదండ్రులకు ఉండదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం కళాశాల డైరక్టర్ మాట్లాడుతూ ఇకనుండి మన కళ్ళముందే బిడ్డలను చదివిపించుకుంటూ ప్రపంచ స్థాయి ర్యాంకులను సాధించవచ్చు అని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల కో డైరెక్టర్ జమున, కళాశాల అధ్యాపకులు అభిషేక్ తివారి, సురేంద్ర గోయల్, మనీష్ తివారి తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article