సీసీఎస్ ఆధ్వర్యంలో పీడీఎస్ రైస్ పట్టివేత

0 9,711

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

జక్రాన్ పల్లి మండలం పడకల్ గ్రామంలో పీడీఎస్ రైస్ విక్రయిస్తున్నాడనే సమాచారం మేరకు సీసీఎస్ పోలీసులు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం పోలీసు కమిషనర్ సాయిచైతన్య, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ ఆలీ ఆదేశానుసారం సీసీఎస్ ఎస్సై గోవింద్ సిబ్బందితో కలిసి పడకల్ గ్రామంలోని జక్రాన్ పల్లి శివారులో ఒక రేకుల షెడ్డులో పీడీఎస్ బియ్యం నిల్వ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారని తెలిసి షెడ్డు పై దాడి నిర్వహించారు. ఈ దాడిలో సుమారు 9 నుంచి 10 క్వింటాళ్ళ పీడీఎస్ బియ్యం స్వాధీనం చేసుకుని, మాక్లూర్ కు చెందిన మహ్మద్ మోహోఖాన్ ను అదుపులోకి తీసుకుని జక్రాన్ పల్లి పోలీస్ స్టేషన్ లో అప్పగించినట్లు ఎస్సై గోవింద్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.