31 C
Hyderabad

అర్హులకు రేషన్ కార్డులు అందేలా చూడాలి

Must read

📰 Generate e-Paper Clip

ఇందల్వాయి, బతుకమ్మ : గ్రామాలలో నిర్వహిస్తున్న కొత్త రేషన్ కార్డు దరఖాస్తు దారుల నుండి అర్హులను పక్కగా గుర్తించి వారికి అందేలా చూడాలని ఎంపీడీఓ అనంతరావు, తహసీల్దార్ వెంకట్రావు సూచించారు. ప్రజా పాలనలో భాగంగా సోమవారం పంచాయతీ కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి భూమిలేని నిరుపేద కూలి కుటుంబాలకు చెందిన ఉపాధి హామీ కార్డు కలిగి 23- 24 సంవత్సరాములో కనీసం 20 రోజుల పని దినాలు చేసిన వారిని పకడ్బందీగా గుర్తించాలన్నారు. ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి దరఖాస్తు చేసుకున్న వారి జాబితాలు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. రైతు భరోసా కు అర్హులైన రైతులకు ప్రతి ఒక్కరికి రైతు భరోసా అందే విధంగా చూడాలన్నారు. ఇప్పటివరకు సర్వే చేసిన జాబితాలను కంప్యూటర్ నందు ఎంట్రీ పూర్తి చేసేలా చూడాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీవో రాజ్ ఖాన్, పంచాయతీ కార్యదర్శులు, ఆపరేటర్లు పాల్గొన్నారు.

More articles

Latest article