నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జాతీయ భద్రత మాస ఉత్సవాల్లో భాగంగా సోమవారం నగరంలోని శివాజీ నగర్ లో గల రామకృష్ణ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కిరణ్ మాట్లాడుతూ మైనర్లు బైకులు డ్రైవ్ చేయొద్దని సూచించారు. హెల్మెట్, లైసెన్సులు సరైన పత్రాలు లేకుండా డ్రైవింగ్ చేయొద్దని తెలిపారు. అదేవిధంగా రోడ్డు భద్రతా నియమాలు పాటించి సురక్షితంగా ప్రయాణం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాహుల్, ఐరాడ్ జిల్లా మేనేజర్ వర్షా నిహాంత్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

