. . . సారంగపూర్ కేజిబివిని సంధర్శించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
జగిత్యాల, బతుకమ్మ:
పెంచిన డైట్ చార్జీలను కస్తూర్బా పాఠశాలలకు వర్తింపజేయకపోవడం బాధాకరం. కేజిబివిలకు కూడా పెంచిన డైట్ చార్జీలను వర్తింపజేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాండ్ చేశారు. జగిత్యాల జిల్లా సారంగపూర్ కస్తూర్బా గాంది బాలికల పాఠశాలను ఎమ్మెల్సీ కవిత సంధర్శించారు. ఈ సంధర్బంగా కవిత విద్యార్థినిలతో ముచ్చటించారు. వారికి అందుతున్న సౌకర్యాల గురించి ఆరా తీశారు. రాష్ట్రవ్యాప్తంగా 472 కస్తూర్బా పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు అందరికీ పౌష్టికాహారం అందించాలి అని కొరారు. సర్వ శిక్ష అభియాన్ కింద పాఠశాలల్లో పనిచేస్తున్న వారిని రెగ్యులరైజ్ చేస్తామని గతంలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని ఈ ఉపాధ్యాయులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కెసిఆర్ మొదలుపెట్టిన గురుకుల పాఠశాలల లక్ష్యాన్ని దెబ్బతీయకూడదు, విద్యార్థులకు ఆహారం అందించే విషయంలో ప్రభుత్వం రాజీ పడకూడదు అని కవిత కొరారు.

