- హైకోర్టు తీర్పుతో నిరాశ చెందాం
- ఓబీసీ జిల్లా అధ్యక్షులు డా.రాజా నరేందర్ గౌడ్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడం దురదృష్టకరమని, హైకోర్టు తీర్పుతో నిరాశ చెందామని ఓబీసీ జిల్లా అధ్యక్షులు డా.రాజా నరేందర్ గౌడ్ అన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసిందని తెలిపారు. కేంద్రం సహకరించకపోయినా, గవర్నర్ పట్టించుకోకపోయినా, ప్రతిపక్షాలు కలిసి రాకపోయినా సీఎం ఒంటరి పోరాటం చేశారని తెలిపారు. సాంకేతికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పద్ధతి ప్రకారం రిజర్వేషన్లు కల్పించామని తెలిపారు. కులగణన చేయడంతో పాటు డెడికేటెడ్ కమిషన్ వేసి బీసీ ల లెక్క తేల్చామన్నారు. బీసీ నోటికాడి బువ్వ అందకుండా పోయిందని పేర్కొన్నారు. అయినా నిరాశ చెందం.. పోరాటం కొనసాగుతుందని తెలిపారు. మా ప్రభుత్వం న్యాయపోరాటాన్ని కొనసాగిస్తుందన్నారు. తప్పకుండా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించి పెడతామని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సహకరించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఇప్పటికైనా బీసీ ల ఆవేదనను అర్థం చేసుకోవాలన్నారు. బీసీ లు ఎవరూ అధైర్యపడొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తప్పని సరిగా రిజర్వేషన్లు సాధించుకుందామని పిలుపునిచ్చారు.
