- అసెంబ్లీలో హామీ ఇచ్చి మాట మార్చడం సీఎం రేవంత్ రెడ్డికి తగదు
- సీఎం రేవంత్ రెడ్డితో తాడోపేడో తేల్చుకుంటాం
- ఈ నెల 9 న జిల్లాలో జరిగే మాదిగల నల్ల జెండాల ప్రదర్శనను విజయవంతం చెయ్యాలి..
- ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ
నిజామాబాద్, బతుకమ్మ : ఎస్సీ వర్గీకరణ అమలు చేయకుండా డీఎస్సీ ఫలితాలు విడుదల చేయడం అన్యాయమని ఎంఆర్ఫీఎస్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ కుమార్ అన్నారు. మంద కృష్ణ మాదిగ ఆదేశం మేరకు శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ అన్ని అనుబంధ సంఘాల జిల్లా సమావేశం నిర్వహించారు ఈ ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు సరికెళ్ళ పోషెట్టి మాదిగ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గీకరణ అమలు చేయకుండా డీఎస్సీ ఫలితాలు విడుదల చెయ్యడం అంటే మాదిగలను విస్మరించడమే అవుతుందని అన్నారు. ఆగస్టు 1న సుప్రీం కోర్టు వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చు అని తీర్పు ఇచ్చిన కమిటీల పేరిట కాలయాపన చేస్తూ మాదిగలను సీఎం రేవంత్ రెడ్డి వంచిస్తున్నాడని అన్నారు. తీర్పు వచ్చిన తర్వాత మంద కృష్ణ మాదిగ కంటే ముందు సీఎం రేవంత్ రెడ్డి శాసన సభలో వర్గీకరణ చేసే మొదటి ముఖ్యమంత్రి నేనే అంటే మాదిగలు నమ్మి రెండు నెలలు ఎదురు చూశామని అయిన ఇంకా రేవంత్ రెడ్డి మాదిగలను మోసం చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాదిగలను డీఎస్సీ ఫలితాలలో విస్మరించినందుకు నిరసనగా ఎనాడైతే అక్టోబర్ 9న డీఎస్సీ ఉద్యోగస్తులకు నియామక పత్రాలు ఇస్తున్నారో అదే రోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మాదిగల నల్ల జెండాల ప్రదర్శన చేసి నిరసన తెలుపుతామని హెచ్చరించారు. సిఎం రేవంత్ రెడ్డితో తాడోపేడో తేల్చుకుంటామని తెలిపారు. ఈ విషయం మీద జిల్లాకు చెందిన పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ స్పందించాలని డిమాండ్ చేశారు. ఎంఎస్పీ జాతీయ నాయకులు మానికొల్ల గంగాధర్ మాదిగ, ఎంఎస్సీజిల్లా నాయకులు మైలారం బాలు మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శిలు లసింగారి భూమయ్య మాదిగ, నాగం రాజేష్ మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు మందర్ణ మారుతి మాదిగ, ఎంఎస్పీ జిల్లా ఉపాధ్యక్షుడు మంద ప్రభాకర్ మాదిగ, ఎంఎంఎస్ జాతీయ నాయకురాలు యమున మాదిగ, సత్తెక్క మాదిగ, సావిత్రి మాదిగ, ఎంఎంఎస్ జిల్లా నాయకురాలు పద్మ, ఎంఎస్పీ జిల్లా నాయకులు యాదశి శ్రీ రాములు మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు కరే పోచిరాం మాదిగ, ఎంఆర్పీఎస్ సాలూరు మండల అధ్యక్షులు భూరే శంకర్ మాదిగ, ఎంఆర్పీఎస్ నిజామాబాద్ టౌన్ అధ్యక్షులు మహేష్ మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు కిన్నెర మోహన్ మాదిగ, ఎంఆర్పీఎస్ ఆర్మూర్ మండల అధ్యక్షులు నాగం శ్రీనివాస్ మాదిగ, ఎంఆర్పీఎస్ జక్రంపల్లి మండల అధ్యక్షులు వేల్పుల వరుణ్ మాదిగ, ఎంఎస్ఎఫ్ జిల్లా నాయకులు కనక శ్రీడీప్ మాదిగ, తదితరులు పాల్గొన్నారు.

