లా అండ్ ఆర్డర్ ను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది

0 15,266
  • ప్రమోద్ కుటుంబానికి అండగా ఉంటాం
  • నిజామాబాద్ ఎంపి ధర్మపురి అర్వింద్

 

నిజామాబాద్, బతుకమ్మ : ఇటీవల రౌడీషీటర్ చేతిలో హత్యకు గురైన సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని నిజామాబాద్ ఎంపి ధర్మపురి అర్వింద్ పరామర్శించారు. సోమవారం రాత్రి నగరంలో గల బ్యాంక్ కాలనీలోని ప్రమోద్ ఇంటికి వెళ్లిన ఎంపి అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ లు ఆయన ఫొటోకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎంపి, ఎమ్మెల్యేలు చెరో లక్ష రూపాయాల చొప్పున రెండు లక్షల చెక్ ను ప్రమోద్ సతీమణికి అందచేశారు. ఈ సంధర్బంగా ఎంపి అరవింద్ మాట్లాడుతు.. అతని ముగ్గురు పిల్లలకు విద్యా పరంగా అండగా ఉంటాం అని తెలిపారు. వారి ముగ్గురు పిల్లలను చదివించే బాధ్యతను తీసుకుంటాం. ప్రమోద్ విధి నిర్వహణలో అసువులు బాయడం దురధ్రుష్టకరం. ఇలాంటి ఘటనలు జరుగాల్సింది కాదు. లా అండ్ అర్డర్ ను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. నిజామాబాద్ లో జరిగిన సంఘటన తరువాత హైద్రాబాద్ లో గోరక్షక్ పై కాల్పులు, తరువాత పోలీసులపై రౌడీ షీటర్ కత్తితో దాడి పోలీసు కాల్పులు జరుగడం చూస్తే శాంతిభధ్రతల పర్యవేక్షణ ప్రభుత్వానికి ఉందని అన్నారు. ఓటు బ్యాంక్ రాజకీయాలను పక్కన పెట్టి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

  • అసిఫ్ ను పరామర్శించిన ఎంపి అరవింద్..

రౌడీషీటర్ రియాజ్ ను పట్టుకునే క్రమంలో తీవ్రంగా గాయపడిన అసీఫ్ ను నిజామాబాద్ ఎంపి ధర్మపురి అరవింద్  పరామర్శించారు. ఎమ్మెల్యేతో కలిసి సోమవారం రాత్రి ఎంపి అరవింద్ అసిఫ్ ను పరామర్శించి అతనికి చెరో రూ.25 వేల చోప్పున రూ.50 వేలు అందచేశారు. అసీఫ్ త్వరగా కోలుకోవాలని కోరారు.

It is the responsibility of the government to control law and orde

Leave A Reply

Your email address will not be published.