24.1 C
Hyderabad
Monday, August 3, 2026

బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డ్ నిధులను ఇతర వాటికి మార్చడం సరికాదు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి నాల్వాల నర్సయ్య

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ ఫండ్ నిధులను కార్మికులకే కేటాయించి సకాలంలో ఉపయోగించాలని వెల్డింగ్ కన్స్ట్రక్షన్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా సహాయ జిల్లా కార్యదర్శి నాల్వాల నరసయ్య అన్నారు. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు అనుబంధం సంఘం ఆధ్వర్యంలో స్థానిక జిల్లా కలెక్టర్ కి సోమవారం మెమొరండం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ నిధులను ఇతర వాటికి మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిధులు ఇతర వాటికి మార్చడం వల్ల కార్మికులకు అందాల్సిన సహకారాలు సకాలంలో అందడం లేదని అన్నారు. అదేవిధంగా పని ప్రదేశాలలో హఠాత్తుగా చనిపోయిన కార్మికులకు 10 లక్షలు ఇవ్వాలని, 60 సంవత్సరాలు నిండిన కార్మికులకు 6000 పెన్షన్ ని కల్పించాలని, కుటుంబ సభ్యుల వివాహాలకు లక్ష రూపాయలు ఇవ్వాలని జీవోలు చెబుతున్న వెల్ఫేర్ బోర్డు పట్టించుకోవడం లేదని అన్నారు. అదేవిధంగా వెల్ఫేర్ బోర్డులను ప్రైవేటు కంపెనీలకు ఇవ్వడం సరికాదని వీటిని ప్రభుత్వమే నడపాలని అన్నారు. చనిపోయిన కార్మికులకు వెంటనే డబ్బును చెల్లించాలని ఇబ్బందులకు గురి చేయడం సరికాదని ప్రభుత్వాన్ని కోరారు. ఇంట్లో మహిళ డెలివరీ అయితే 30 వేల కోసం ప్రూఫ్ లు అందించిన సకాలంలో డబ్బులు విడుదల కాక కుటుంబాలలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కోరారు. ఈ కార్యక్రమంలో బిల్డింగ్ వర్కర్స్ జిల్లా నాయకులు అంజయ్య, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

 

More articles

Latest article