30.9 C
Hyderabad
Monday, August 3, 2026

ప్రోత్సాహక నిధుల పంపిణీ లో పాల్గొనడం ఆనందంగా ఉంది

Must read

📰 Generate e-Paper Clip

 

. . . నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించిన ప్రధాన్ మంత్రి వికసిత్ భారత్ రోజ్ గార్ యోజన కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్‌లో లబ్ధిదారులకు ప్రోత్సాహక నిధుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ ధర్మపురి అరవింద్ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న యువతకు ప్రోత్సాహక నిధులను అందజేశారు.

 

It is a pleasure to participate in the distribution of incentive funds.

 

యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, స్వయం ఉపాధిని ప్రోత్సహించడం, ఆర్థికంగా అభివృద్ధి సాధించేలా చేయడం ఈ పథకం ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో కేంద్ర ప్రభుత్వం యువత సాధికారతకు, ఉద్యోగ అవకాశాల విస్తరణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని వారు పేర్కొన్నారు.

 

It is a pleasure to participate in the distribution of incentive funds.

 

ప్రధాన్ మంత్రి వికసిత్ భారత్ రోజ్ గార్ యోజన ద్వారా దేశవ్యాప్తంగా యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి మరియు స్వయం ఉపాధి రంగాల్లో కొత్త అవకాశాలు అందుతున్నాయని వారు వెల్లడించారు.

 

It is a pleasure to participate in the distribution of incentive funds.

More articles

Latest article